మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్య
మమ్ము కరుణించినావయ్య
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్య
మేము తరియించినామయ్య "మా పాపాల"
పసిపాప మనసున్న ప్రతిమనిషిలోను పరమాత్ముడున్నాడని
వాడు పరిశుద్దుడవుతాడని
గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి
మమ్ము సాకావు మా సాయి
వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైనా పూలన్ని ఒకటంటివి
నిన్ను పూజించ తగునంటివి
మా తడిలేని హృదయాల దయతోటి తడిపి
తలపుల్ని తీసేస్తివి, మా కలతలని మాపేస్తివి "మా పాపాల"
పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం మిగిలేది ఈ పుణ్యం
ఇచ్చు మేలైన పై జన్మం
రోగుల్ని ప్రేమించి వ్యాదుల్ని మాపి మరుజన్మ ఇచ్చావయ్య
వారి బాదల్ని మోసావయ్య
ఏనాడు పుట్టావో ఏడేడ తిరిగావో
నువ్వెంత వాడైతివో నువ్వు ఏనాటి దైవానివో
ఈ ద్వారకామాయి నివాసమాయే ధన్యులమయినామయ్య
మాకు దైవామైవెలిసావయ్య "మా పాపాల"
Saturday, 15 September 2007
మా పాపాల తొలగించు
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
బాగున్నాయి. కాకపోతే రెండు విషయాలు.
౧. అచ్చు తప్పులు సరిచూడండి
౨. పాట వివరాలు వ్రాయండి (సినిమా పేరు, పాడినది, సాహిత్యం)
శుభాకాంక్షలతో.
Post a Comment