అల్లా సాయి ,యేసు సాయి ,ఈశ్వర సాయి ,సర్వం సాయి "2"
శ్రీ గురుదత్త స్వరూప సాయి
శ్రీ పండరి విఠలేశ సాయి "2"
సర్వాభిష్ట ప్రధాయక సాయి
సాధు పురుష పరిపాలక సాయి "2"
అల్లా సాయి ,యేసు సాయి ,ఈశ్వర సాయి ,సర్వం సాయి "2"
అణువణువున దాగిన శ్రీ సాయి
అంతరాళమున నిలిచిన సాయి "2"
అండపిండ బ్రహ్మాండము సాయి
అంతర్హితుడై వెలిసిన సాయి "2"
అల్లా సాయి ,యేసు సాయి ,ఈశ్వర సాయి ,సర్వం సాయి "2"
త్రిగుణాతీతుడు దైవం సాయి
తిలోకవంద్యి దు దేవుడు సాయి "2"
పంచభూత నిక్షిప్తుడు సాయి
పతితపావనుడు ఫకీరు సాయి "2"
అల్లా సాయి ,యేసు సాయి ,ఈశ్వర సాయి ,సర్వం సాయి "2"
వాణి లక్ష్మీ పార్వతి సాయి
వాసవాది సన్నుత శ్రీ సాయి "2"
గౌరీ చండీ దుర్గా సాయి
శాంభవి కాళి శాంకరీ సాయి
అల్లా సాయి ,యేసు సాయి ,ఈశ్వర సాయి ,సర్వం సాయి "2"
వేంకటేశ వేదాత్మక సాయి
సంకతనాశ సద్గురు సాయి "2"
మురలీధర రమాభవ సాయి
ముకుంద కేశవ శౌరీ సాయి "2"
అల్లా సాయి ,యేసు సాయి ,ఈశ్వర సాయి ,సర్వం సాయి "2"
హిందూ ముస్లిం క్రైస్తవ సాయి
గీత ఖురాను బైబిలు సాయి "2"
ఆత్మదర్శణం చేసిన సాయి
అఖిలమునే ప్రేమించిన సాయి "2"
అల్లా సాయి ,యేసు సాయి ,ఈశ్వర సాయి ,సర్వం సాయి "2"
Saturday, 15 September 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment