Saturday 15 September 2007

బాబా, సాయి బాబా

బాబా, సాయి బాబా
బాబా, సాయి బాబా

నీవూ మావలె మనిషివని
నీకూ మరణం వున్నదని

అంటే, ఎలా నమ్మేది
అనుకొనీ, ఎలా బ్రతికేది

బాబా, సాయి బాబా
బాబా, సాయి బాబా

నువ్వే మరణించావంటె ఆ దేవుడెలా బ్రతికుంటాడు "2"
నువ్వే దేవుడివైతే, ఆ మృత్యువెలా శాసిస్తాడు

తిరుగాడె కోవెల నీదేహం
చిరిగినంతనే శిథిలం అవుతుందా

పిలిచినంతనే పలికే దైవం మూగై పోతాడా

బాబా, సాయి బాబా
బాబా, సాయి బాబా "నీవు మావలె"

దివిలో వున్నా భువిలొ వుండె మాకై నింగిని చీల్చుకురా
దిక్కులలోన ఎక్కడ వున్న ముక్కలు చెక్కలు చేసుకురా "2"

సూర్యచంద్రులను చుక్కల గుంపును కూల్చి రాల్చి రావయ్యా
గ్రహములు గోళల్ ఇహ పర శక్తులు గగ్గోలెత్తగా రావయ్యా

నువు లేకుంటె నువు రాకుంటె ఎందుకు మాకు ఈ లోకం "2"

లయం వచ్చి ప్రపంచం అంతా నాశనం ఐపొనీ
ముల్లోకాలు కల్లోలంలో శూన్యం ఐపొనీ

కదిలే జ్వాలాగ్ని ఎగసే బడబాగ్ని
దైవం ధర్మాన్ని దగ్ధం చేసేది

నేనే ఆత్మైతే నీవే పరమాత్మ
నీలొ నన్ను ఐక్యం ఐపొనీ, పొనీ

No comments: