మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్య
మమ్ము కరుణించినావయ్య
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్య
మేము తరియించినామయ్య "మా పాపాల"
పసిపాప మనసున్న ప్రతిమనిషిలోను పరమాత్ముడున్నాడని
వాడు పరిశుద్దుడవుతాడని
గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి
మమ్ము సాకావు మా సాయి
వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైనా పూలన్ని ఒకటంటివి
నిన్ను పూజించ తగునంటివి
మా తడిలేని హృదయాల దయతోటి తడిపి
తలపుల్ని తీసేస్తివి, మా కలతలని మాపేస్తివి "మా పాపాల"
పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం మిగిలేది ఈ పుణ్యం
ఇచ్చు మేలైన పై జన్మం
రోగుల్ని ప్రేమించి వ్యాదుల్ని మాపి మరుజన్మ ఇచ్చావయ్య
వారి బాదల్ని మోసావయ్య
ఏనాడు పుట్టావో ఏడేడ తిరిగావో
నువ్వెంత వాడైతివో నువ్వు ఏనాటి దైవానివో
ఈ ద్వారకామాయి నివాసమాయే ధన్యులమయినామయ్య
మాకు దైవామైవెలిసావయ్య "మా పాపాల"
Saturday, 15 September 2007
మా పాపాల తొలగించు
నువులేక అనాథలం
సాయిబాబా సాయిబాబా
సాయినాథ సాయిదేవా
సత్యం నిత్యం నేవే కావా
నువులేక అనాథలం
భ్రతుకంతా అయోమయం "2"
బాబా ఓ బాబా
ఇక నీ పరీక్షకు మేమాగలేము
ఇటులీ నిరీక్షణ మేమోపలేము
నువులేక అనాథలం
భ్రతుకంతా అయోమయం
బాబా ఓ బాబా
మా పాలి దైవం అని
మా దిక్కు నీవేనని కొలిచాము దినం దినం సాయి
మా ఆర్థి చూస్తావని
సాక్షాత్కరిస్తావని వేచాము క్షణం క్షణం సాయి
శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా
ఏ దైవమైనా ఏ ధర్మమైనా నీలోనే చూచాము సాయి
రావా బాబా రావా రక్షా రక్షా నీవే కదా మా బాబా
నువులేక అనాథలం
భ్రతుకంతా అయోమయం
బాబా ఓ బాబా
మా యేసు నీవేనని మా ప్రభువు నీవేనని
ప్రార్థనలు చేసామయ్య నిన్నే
అల్లాగా వచ్చావని చల్లంగా చూస్తావని
చేసాము సలాం సలాం నీకే
గురునానక్ అయినా గురుగోవిందు అయినా
గురుద్వారమయిన నీద్వారకేనని
నీ భక్తులయినాము సాయి
రావా బాబా రావా రక్షా రక్షా నీవే కదా మా బాబా
నువులేక అనాథలం
భ్రతుకంతా అయోమయం
బాబా ఓ బాబా
ఇక నీ పరీక్షకు మేమాగలేము
ఇటులీ నిరీక్షణ మేమోపలేము
క్రిష్ణ క్రిష్ణ రామ సాయి "2"
అల్లా సాయి మౌలా సాయి నానక్ సాయి గోవిందు సాయి యేసు సాయి షిర్డీ సాయి"2"
సాయి సాయి బాబా సాయి "4"
ఓం
ఎంతెంత దయనీది ఓ సాయి
నిను ఏమని పొగడను సర్వాంతర్యామి
ఎంతెంత దయనీది ఓ సాయి "2"
నిను ఏమని పొగడను సర్వాంతర్యామి
ఎంతెంత దయనీది ఓ సాయి "2"
తొలగించినావు వ్యాధులు ఊదితో
వెలిగించినావు దివ్వెలు నీటితో "2"
నుడులకు అందవు నుతులకు పొంగవు "2"
పాపాలు కడిగేసె పావన గంగవు
ఎంతెంత దయనీది ఓ సాయి "2"
నిను ఏమని పొగడను సర్వాంతర్యామి
భక్త కభీరే నీ మతమన్నావు
భగవానుడే నీ కులమన్నావు "2"
అణువున నిండిన బ్రహ్మాండంలా ఆ ఆ.."2"
అందరిలో నేవే కొలువున్నావు
ఎంతెంత దయనీది ఓ సాయి "2"
నిను ఏమని పొగడను సర్వాంతర్యామి
ప్రభవించినావు మానవ మూర్తివై
ప్రసరించినావు ఆరని జ్యోతివై "2"
మారుతి నీవే గణపతి నీవే "2"
సర్వదేవతల నవ్యాకృతి నీవే
ఎంతెంత దయనీది ఓ సాయి "2"
నిను ఏమని పొగడను సర్వాంతర్యామి
ఎంతెంత దయనీది ఓ సాయి "2"
బాబా సాయి బాబా
బాబా మా సాయి బాబా
బాబా బాబా షిరిడి బాబా
అల్లా సాయి ,యేసు సాయి
శ్రీ గురుదత్త స్వరూప సాయి
శ్రీ పండరి విఠలేశ సాయి "2"
సర్వాభిష్ట ప్రధాయక సాయి
సాధు పురుష పరిపాలక సాయి "2"
అల్లా సాయి ,యేసు సాయి ,ఈశ్వర సాయి ,సర్వం సాయి "2"
అణువణువున దాగిన శ్రీ సాయి
అంతరాళమున నిలిచిన సాయి "2"
అండపిండ బ్రహ్మాండము సాయి
అంతర్హితుడై వెలిసిన సాయి "2"
అల్లా సాయి ,యేసు సాయి ,ఈశ్వర సాయి ,సర్వం సాయి "2"
త్రిగుణాతీతుడు దైవం సాయి
తిలోకవంద్యి దు దేవుడు సాయి "2"
పంచభూత నిక్షిప్తుడు సాయి
పతితపావనుడు ఫకీరు సాయి "2"
అల్లా సాయి ,యేసు సాయి ,ఈశ్వర సాయి ,సర్వం సాయి "2"
వాణి లక్ష్మీ పార్వతి సాయి
వాసవాది సన్నుత శ్రీ సాయి "2"
గౌరీ చండీ దుర్గా సాయి
శాంభవి కాళి శాంకరీ సాయి
అల్లా సాయి ,యేసు సాయి ,ఈశ్వర సాయి ,సర్వం సాయి "2"
వేంకటేశ వేదాత్మక సాయి
సంకతనాశ సద్గురు సాయి "2"
మురలీధర రమాభవ సాయి
ముకుంద కేశవ శౌరీ సాయి "2"
అల్లా సాయి ,యేసు సాయి ,ఈశ్వర సాయి ,సర్వం సాయి "2"
హిందూ ముస్లిం క్రైస్తవ సాయి
గీత ఖురాను బైబిలు సాయి "2"
ఆత్మదర్శణం చేసిన సాయి
అఖిలమునే ప్రేమించిన సాయి "2"
అల్లా సాయి ,యేసు సాయి ,ఈశ్వర సాయి ,సర్వం సాయి "2"
బాబా, సాయి బాబా
బాబా, సాయి బాబా
బాబా, సాయి బాబా
నీవూ మావలె మనిషివని
నీకూ మరణం వున్నదని
అంటే, ఎలా నమ్మేది
అనుకొనీ, ఎలా బ్రతికేది
బాబా, సాయి బాబా
బాబా, సాయి బాబా
నువ్వే మరణించావంటె ఆ దేవుడెలా బ్రతికుంటాడు "2"
నువ్వే దేవుడివైతే, ఆ మృత్యువెలా శాసిస్తాడు
తిరుగాడె కోవెల నీదేహం
చిరిగినంతనే శిథిలం అవుతుందా
పిలిచినంతనే పలికే దైవం మూగై పోతాడా
బాబా, సాయి బాబా
బాబా, సాయి బాబా "నీవు మావలె"
దివిలో వున్నా భువిలొ వుండె మాకై నింగిని చీల్చుకురా
దిక్కులలోన ఎక్కడ వున్న ముక్కలు చెక్కలు చేసుకురా "2"
సూర్యచంద్రులను చుక్కల గుంపును కూల్చి రాల్చి రావయ్యా
గ్రహములు గోళల్ ఇహ పర శక్తులు గగ్గోలెత్తగా రావయ్యా
నువు లేకుంటె నువు రాకుంటె ఎందుకు మాకు ఈ లోకం "2"
లయం వచ్చి ప్రపంచం అంతా నాశనం ఐపొనీ
ముల్లోకాలు కల్లోలంలో శూన్యం ఐపొనీ
కదిలే జ్వాలాగ్ని ఎగసే బడబాగ్ని
దైవం ధర్మాన్ని దగ్ధం చేసేది
నేనే ఆత్మైతే నీవే పరమాత్మ
నీలొ నన్ను ఐక్యం ఐపొనీ, పొనీ
హే పాండురంగ, పండరినాథ
శరణం శరణం శరణం
బాబా శరణం సాయి శరణు శరణం
బాబా చరణం గంగ యమున సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయె ఆ పాండురంగడు కరుణామయుడు సాయె
విద్యా బుద్దులు వేడిన బాలకు అగుపించాడు విగ్ణేశ్వరుదై
పిల్లా పాపలు కోరిన వారిని కరుణించాడు సర్వేస్వరుడై
తిరగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణు రూపుడై
మగశ శ్యామకు మారుతి గాను మరికొందరికి దత్తాత్రేయుడిగా
యద్భావం తద్భవతని దర్షనమిచ్చాడు ధన్యుల చెశాడు
బాబా శరణం సాయి శరణు శరణం
బాబా చరణం గంగ యమున సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయె ఆ పాండురంగడు కరుణామయుడు సాయె
పెను తుపాను తాకిడిలో అలమటించు దీనులను
ఆదరించె సాయినాధ నాధుడై
అజ్ఞానం అలుముకున్న అంధులను చేరదీసి
అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై
వీధి వీధి బిచ్చమెత్తి వారి వారి పాపములను
పుచ్చుకొని మోక్షమిచ్చె పూజ్యుడై
పుచ్చుకున్న పాపములను ప్రక్షాలణ చెసికొనెను
దౌత్య క్రియ సిద్దితో శుద్దుడై
అంగములను వేరుచెసి ఖండయోగ సాధనలొ
అత్మశక్తి చాటెను సిద్దుడై
జీవరాశులన్నిటికి సాయే శరణం సాయే శరణం
దివ్య జ్ఞాన సాధనకు సాయే శరణం సాయే శరణం
ఆస్తికులకు సాయే శరణం
నాస్తికులకు సాయే శరణం
భక్తికి సాయే శరణం
ముక్తికి సాయే శరణం
బాబా శరణం సాయి శరణు శరణం
బాబా చరణం గంగ యమున సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయె ఆ పాండురంగడు కరుణామయుడు సాయె